నాలుగు రోజుల్లో రూ. 600 కోట్ల ..లిక్కర్‌,సేల్స్.

భారత్ న్యూస్ హైదరాబాద్….రికార్డ్ బ్రేక్..

నాలుగు రోజుల్లో రూ. 600 కోట్ల సేల్స్..🖊️

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి వాతావరణం జనాల్ని ముప్పుతిప్పలు పెడుతుతోంది. ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అయితే, చలి వాతావరణంలోనూ మద్యం ప్రియులు వెనక్కుతగ్గటం లేదు. చిల్డ్ బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది నాలుగు రోజుల్లో 4.26 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్ సేల్స్ 107 శాతం పెరిగాయి.
ఇక, తెలంగాణ వ్యాప్తంగా మద్యం సేల్స్ రికార్డును బ్రేక్ చేశాయి. నాలుగు రోజుల్లోనే దాదాపు 600 కోట్ల రూపాయల మద్యం సేల్స్ జరిగాయి. డిసెంబర్ 1వ తేదీనుంచి 4వ తేదీ రాత్రి వరకు 578.86 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి.

రెండేళ్లలో 71వేల కోట్ల అమ్మకాలు..

2023-25 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగిసింది. ఈ రెండేళ్లలో మద్యం అమ్మకాలు ఊహించని విధంగా పెరిగాయి. గత రెండేళ్లలో 724 లక్షల కేసుల లిక్కర్‌, 960 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.

పాతపాలసీ ప్రారంభమైన 2023 డిసెంబరులో ఏకంగా రూ.4,297 కోట్ల వ్యాపారం జరిగింది. అనంతరం 2024 జనవరి నుంచి డిసెంబరు వరకు రూ.37,485 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు రూ.29,766 కోట్ల అమ్మకాలు జరిగాయి..