సింగరాయకొండలో రైతు భరోసా పేరుతో వృద్ద జంటను మోసం — అప్లికేషన్ ఫీజ్ అవ్తుంది అని చెప్పి డబ్బులు తీసుకొని పరార్

భారత్ న్యూస్ అనంతపురం,,సింగరాయకొండలో రైతు భరోసా పేరుతో వృద్ద జంటను మోసం — అప్లికేషన్ ఫీజ్ అవ్తుంది అని చెప్పి డబ్బులు తీసుకొని పరార్

సింగరాయకొండ బస్టాండ్ వద్ద రైతు భరోసా సొమ్ము వచ్చిందని నమ్మబలికి ఓ వ్యక్తి ఇద్దరి వృద్ధులను మోసగించారు. శానంపూడి నుండి కందుకూరు ఆసుపత్రికి వెళ్లి తిరిగి సింగరాయకొండ బస్టాండ్ లో దిగిన ఈ ఇద్దరిని ఒక వ్యక్తి “మీ రైతు భరోసా డబ్బు వచ్చింది, అప్లికేషన్ తీసుకోవాలి” అంటూ కరేటి వారివారి వీధికి తీసుకెళ్లాడు.

అప్లికేషన్ ఫీజు కి వారివద్ద నుంచి ₹2,500 తీసుకున్నాడు. తరువాత “మీరు కాసేపు వేచి ఉండండి, నేను అప్లికేషన్ తెచ్చి ఇస్తాను” అంటూ వెళ్లిపోయి తిరిగి కనిపించలేదు. తమ డబ్బులు పోయాయని గ్రహించిన వారు ఆందోళనకు గురయ్యారు.

విషయం తెలిసిన స్థానికులు మానవత్వం చూపించి, వారి ప్రయాణ ఖర్చుకు అవసరమైన మొత్తం అందించి వారిని తమ గ్రామమైన శానంపూడికి పంపించారు.