భారత్ న్యూస్ విశాఖపట్నం..ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్
డ్యామ్ దిగువన ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ రంద్రం ప్రమాదకరంగా మారిందని నిపుణుల కమిటీ ఆందోళన
కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్ వద్ద అండర్ వాటర్ పరిశీలనలు చేసి, ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన రంద్రం డ్యామ్ పునాదుల కంటే ఎక్కువ లోతుకు విస్తరించిందని తెలిపిన నిపుణుల కమిటీ
ఈ రంద్రం 35–45 మీటర్లు ఉందని, అప్రాన్ వద్ద మొదలయ్యి 150 మీటర్ల మేర, డ్యామ్ వైపు 14–15 మీటర్లు విస్తరించిందని నిపుణుల కమిటీ నివేదికలో వెల్లడి

డ్యామ్ భద్రత ప్రశ్నార్థకంగా ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టాలని సూచించిన నిపుణుల కమిటీ