నూతన రైతు సేవా కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

భారత్ న్యూస్ రాజమండ్రి…నూతన రైతు సేవా కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

అవనిగడ్డలో నూతన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. స్థానిక రెవెన్యూ హాల్ ఎదురుగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.23.94 లక్షలు, గ్రామ పంచాయతీ నిధులు రూ.4లక్షలు కలిపి ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తేమ శాతం పరీక్షను, వ్యవసాయ విజ్ఞాన పుస్తక ప్రదర్శనను, రైతుల కోసం సిద్ధం చేసిన గోనె సంచులను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, ఎంపీపీ తుంగల సుమతి, పీఏసీఎస్ చైర్మన్ యలవర్తి నాగ మునేశ్వరరావు (చిన్నా), తహసీల్దార్ కే.నాగమల్లేశ్వర రావు, వైస్ ఎంపీపీ పులిగడ్డ పిచ్చేశ్వరరావు, మండల కో-ఆప్షన్ సభ్యులు షేక్ నజీర్ బాషా, పంచాయతీరాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్ బాబు, ఏఈ బ్రహ్మానందబాబు, ఏడీఏ జయప్రద, ఏఓ శుభ హారిక, మురళీకృష్ణ, ఆయా శాఖల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.