భారత్ న్యూస్ గుంటూరు….డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం రూ.90 దాటింది.
రోజురోజుకూ పడిపోతున్న రూపాయి విలువ..
భారంగా మారిన విదేశాల్లో ఉన్నత విద్య
రూపాయి విలువ బలహీనపడుతున్నకొద్దీ దిగుమతి సరుకుల ధరలు భారీగా పెరుగుతుండగా, ఎగుమతి అయ్యే వస్తువులు చౌకగా మారిపోతున్నాయి.
ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. పతనమవుతున్న రూపాయి విలువతో ప్రధానంగా ప్రభావితమవుతున్నవారు విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు. ఇది వారి కుటుంబాలను కంటికి కనిపించని రీతిలో దెబ్బ కొడుతున్నది.

రూపాయి విలువ తగ్గడం కారణంగా అమెరికా, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుతున్న విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక భారం తడిసి మోపెడవుతున్నది.