భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుడివాడ రూరల్ సీఐ ఎస్.ఎల్.ఆర్. సోమేశ్వరరావు గారికి, నందివాడ SI శ్రీ కుడిపూడి శ్రీనివాసు గారికి అందిన రహస్య సమాచారంతో, ఈ రోజు అనగా ది 29-11-2025 న మధ్యాహ్నం 03.00 గంటలకు రుద్రపాక గ్రామ శివారు గాజలపాడు గ్రామ చెరువు గట్టు వద్ద పేకాట నిర్వహిస్తున్న నిర్వాహకుడు చలసాని కోటేశ్వరరావు ఆధ్వర్యంలోని పేకాట శిబిరంపై సిబ్బందితో కలిసి దాడి చేసి మొత్తం 17 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 52 పేక ముక్కలు, నగదు ₹3,57,380/-, 20 సెల్‌ఫోన్లు, ఒక కారు, మూడు మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
