తస్మాత్ జాగ్రత్త… Beware with fake Reporters

.భారత్ న్యూస్ హైదరాబాద్….తస్మాత్ జాగ్రత్త… Beware with fake Reporters

ఇటీవలి కాలంలో అసలు రిపోర్టర్ల్లా నటిస్తూ పెద్ద పెద్ద ఈవెంట్లలో హల్చల్ చేయడం కొంతమంది వ్యక్తులకు అలవాటైపోయింది. ఇంతకీ వీళ్లెవరు? ఇలా ఎలా ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు? ఇంత ఈజీగా VIP ఐడీ కార్డులు ఎలా వస్తున్నాయి ? పాస్ లు ఉంటే ఓకే, కానీ దాదాపు అన్ని నేషనల్ మీడియా లోగోలు చేతబట్టి తిరగడం నిజంగా అనుమానాస్పదంగా ఉంది.

హైదరాబాద్‌లో ఈరోజు నకిలీ నేషనల్ మీడియా రిపోర్టర్ల పేరుతో బ్యాగుల్లో లోగోలు పెట్టుకుని తిరుగుతున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైటెక్ సిటీలోని ఒక హోటల్‌లో ఫేక్ రిపోర్టర్ల సంచలనం చోటుచేసుకుంది. గవర్నర్ కార్యక్రమంలో ప్రవేశించేందుకు 8 నేషనల్ మీడియా లోగోలు తీసుకుని వచ్చిన ఒక అనుమానాస్పద వ్యక్తిని అసలు నేషనల్ మీడియా ప్రతినిధులే గుర్తించి పట్టుకున్నారు. అనంతరం వారిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.

పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. నకిలీ రిపోర్టర్ల కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలు, ఈవెంట్ నిర్వాహకులు మరియు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు వర్గాలు సూచిస్తున్నాయి.