భారత్ న్యూస్ గుంటూరు…’ఆడబిడ్డ నిధి’ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు
AP: ‘ఆడబిడ్డ నిధి’ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం.

మొదటి విడత నిధుల విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. కాగా, 2024 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే…