భారత్ న్యూస్ విజయవాడ…అరుదైన ఘటన.. ఇద్దరి వేలిముద్రలు ఒకేలా!
సాధారణంగా ఏ ఇద్దరి వేలిముద్రలు, రెటీనా సరిపోలవు. కానీ యూపీలోని కాన్పూర్కు చెందిన ప్రబల్, పవిత్ర మిశ్రా అనే కవలల ఫింగర్ ప్రింట్స్, రెటీనాలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. ఒకరి ఆధార్ అప్డేట్ చేస్తే మరొకరిది డీయాక్టివేట్ అవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జన్యుపరంగా ఇది అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇది సాంకేతిక లోపమా లేక నిజంగానే బయోమెట్రిక్స్ సరిపోయాయా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.
