భారత్ న్యూస్ అనంతపురం…అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్లోబల్ హాస్పిటల్ కిడ్నీ రాకెట్ సంచలనం….

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇతర రాష్ట్రాలలో కూడా కొనసాగుతున్న పోలీసుల విచారణ…
ఏపీతో సహా వివిధ రాష్ట్రాలలోనూ కిడ్నీల రాకెట్ ముఠాకు లింకులు..
తీగ లాగితే కదులుతున్న దండు పాళ్యం డొంక….
కిడ్నీలు పోగొట్టు కున్నది ఎక్కడివారు..? అమర్చుకున్నది ఎవరు..?
డబ్బు ఎర చూపి అమాయకుల కిడ్నీలు దొంగలించారని పుకార్లు…
డయాలసిస్ కేంద్రాలతో ముడిపడి సాగుతున్న కిడ్నీల వ్యాపారం….
మదనపల్లె గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా రాకెట్…
దొంగే దొంగ.. దొంగ.. అని అరిచినట్లు డిసిహెచ్ ల విచారణ…
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా నడిచిన కిడ్నీల రాకెట్ ముఠా చేతిలో కిడ్నీలు పోగొట్టు కున్నది ఎవరూ..? ఎక్కడివారు..? ఆ కిడ్నీలతో లబ్ది పొందినది ఎవరూ..? ఎక్కడెక్కడి వారు..? వారిలో అమాయక మహిళలు, పురుషులు, ఆనాధలు ఇంకెందరు ఉన్నారో..? లబ్ధి పొందిన వారి వివరాలను దేవశిరోమణి, పద్మాంజలి, రమేష్ బాబు లు బయట పెట్టకపోవడంతో గోప్యత దేనికి సంకేత మనేది లక్షల మంది మదిని తొలసేస్తున్న ప్రశ్నకు బదులెవరిస్తారు. కిడ్నీ రాకెట్ ముఠా చేతిలో విశాఖపట్నం, ఆనందపురం మండలం, బొడ్డు పాల్యంకు చెందిన సాడి కృష్ణ భార్య యమున(29)ని అదే ప్రాంతానికి చెందిన సూరిబాబు పెళ్లి పద్మ, కాకర్ల సత్య “వలపు వల” విసిరి పిక్నిక్ పేరుతో మదనపల్లెకు తీసుకొచ్చారని పోలీసులు నిర్ధారించారు. అర్థ రాత్రి వేల ఆస్పత్రికి స్క్రీట్ గా తీసుకెళ్లి అడ్మిట్ చేయడానికి ముందుగా వేసుకున్న పథకమే కావచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. యమున కిడ్నీని దొంగలించాక చనిపోయిన ఆమె శవాన్ని ఎక్కడ దాచేశారో కూడా అంతు చిక్కడం లేదు.
కిడ్నీ రాకెట్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన యమున డోనరే కాదు..!
కిడ్నీ రాకెట్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన యమున డోనరే కాదని తేలసింది. ఆమెను కిడ్నీ రాకెట్లో కీలక పాత్ర పోషిస్తున్న పెళ్లి పద్మ, కాకర్ల సత్య, సూరి బాబుతో “వలపు వల” వేసి ఊబిలోకి లాక్కున్నట్లు తెలిసింది. అనుకున్నట్లుగానే పథకం ప్రకారం పిక్నిక్ పేరుతో ఈ నెల 6న అరకు వెళుతున్నట్లు యమున ఇంట్లో చెప్పించి, మంచిగా చూస్తూ సపర్యాలు చేసి ఆమెకు మరింత సన్నిహితంగా ముఠా సభ్యులు దగ్గరయ్యారు. మదనపల్లి కు శనివారం తీసుకొచ్చి అర్ధరాత్రి 2 గంటల వేళ గ్లోబల్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ అదే రోజు రాత్రే ఆపరేషన్ చేసి యమున కిడ్నీ దొంగలించారని సమాచారం. నరం కట్ అవడంతో రక్తం అధికంగా పోయి చనిపోయిందని తెలిసింది. ఒకవైపున మాత్రమే ఆపరేషన్ చేసి ఒకే కిడ్నీ తీశారని వైద్యులు అనుమానిస్తూ నివేదిక ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. ఒక కిడ్నీ తీస్తే యమునా ఎందుకు చని పోయిందని యమునా తో సన్నిహితంగా నటించిన సూరి బాబు కిడ్నీ రాకెట్ లోనే కీలక సూత్ర, పాత్రధారులు పెల్లి పద్మ కాకర్ల సత్య ను నిలదీయడంతో తిరుపతిలో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిడ్నీ రాకెట్ వ్యవహారం బట్ట బయలు అయింది.
గ్లోబల్ ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఆధారాలే కీలకం
గ్లోబల్ ఆస్పత్రి ముందు, లోపల వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల డేటాతో పోలీసులు ముందడుగు వేస్తారో లేక పట్టుబడ్డ నిన్ఫితులు ఇచ్చే సమాచారం దర్యాప్తును కొనసాగిస్తారో పోలీసులకు సవాలుగా మారిన కిడ్నీల రాకెట్
కిడ్నీ ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు అప్పటికప్పుడే రావడం సాధ్యమా..? పథకం ప్రకారమే కిడ్నీలు దొంగలించారా..? దీని వెనక ఆంతర్యం ఏమిటి?
ఒక కిడ్నీ ట్రాన్స్పంటేషన్ జరగాలి అంటే అధునాతన టెక్నాలజీ కలిగిన వైద్య పరికరాలు, అపార అనుభవం కలిగిన వైద్యుల బృందం ఉండాలి. యమున కిడ్నీ శనివారం అర్ధరాత్రి తొలగించడం. నిమిషాల వ్యవధిలోనే ఆమె చనిపోవడం, ఆ కిడ్నీతో ముఠాలోని వైద్యుల బృందం బెంగళూరు మీదుగా గోవాకు తీసుకు వెళ్లిపోవడం, డబ్బులు పంపిణీ అన్ని చకచకా అదే రోజే జరిగిపోయాయని తెలిసింది. అయితే ఇదంతా నిమిషాల వ్యవధిలో కిడ్నీ తొలగించడం, దొంగలించడం జరిగిందంటే రాకెట్ లోని ముఠా పథకం ప్రకారం ముందుగానే డాక్టర్ల బృందాన్ని రప్పించుకుని యమునా కిడ్నీలు తొలగించారని తేటతెల్లం అవుతోంది. ఆమె చనిపోయిన రెండు రోజులు యమున మృతదేహాన్ని ఎక్కడ ఉంచారు అన్నది లక్షల మంది మదిలో మెదులు తున్న ప్రశ్న.. పోలీసులకు సైతం ఆ రహస్యాన్ని బయటకి పొక్కనివ్వకుండా ఎంక్వయిరీకి వచ్చిన డిసిహెచ్ఎస్ తదితర అధికారులు, పోలీసులు గోప్యత పాటించడం వెనక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
దొంగే.. దొంగ.. దొంగా అని అరిచినట్లు వైద్యం బృందం విచారణ పై అన్నీ అనుమానలే
దొంగే దొంగ.. దొంగా.. అని అరచినట్లు సుధీర్ఘకాలం అస్పత్రుల్లో కలసి పనిచేసిన అన్నమయ్య జిల్లా డిసిహెచ్ఎస్, కిడ్నీ రాకెట్లో ఏ1ముద్దాయి అయిన డా.ఆంజనేయులు కేసు విచారణ అసలు దోషులుగా చేర్చాల్చిన వారితో చేయిస్తు నీరు కారుస్తున్నట్లు చర్చ సాగుతోంది. జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ డెమో దేవ శిరోమణి, చిత్తూరు డీసీహెచ్ఎస్ పద్మాంజలిదేవి, డిప్యూటీ డీఎంహెచ్ రమేష్ బాబుతో విచారణ చేయించ కుండా, ఆ కేసులో వీరిని చేర్చాలని సిపిఐ డిమాండ్ చేసింది. విచారణ అధికారులు అందరూ సర్వీసు మొత్తం సొంత జిల్లాలోనే పూర్తిచేసిన వారు నిందితుడు ఆంజనేయులుతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే కావడంతో విచారణ పారదర్శకంగా సాగదని పలువురు ఆరోపిస్తున్నారు.
కేసు తారుమారు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు
కిడ్నీ రాకెట్ లోని ముఠా ను పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా ఏర్పడి, ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తూ అనుమానితులను మదనపల్లి తీసుకువస్తున్నారు. అయితే ఇప్పటికే ఆధారాలు చెరిపేసిన కిడ్నీ రాకెట్ లోని బృందం బాగోతం బయటపడినప్పటికీ ఆ ఆసుపత్రి యాజమాన్యంలోని డాక్టర్ ఆంజనేయులు మినహ వైద్యుల బృందం పై ఎలాంటి కేసులు నమోదు చేయక పోవడంతో పోలీసుల దర్యాప్తు తీరుపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కిడ్నీ రాకెట్ లో మూలాలను గుర్తించడంలో విఫలం
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా సాగిన కిడ్నీ రాకెట్ లో ని మూలాలను గుర్తించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పలు ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం ఆరోపించారు. నిజా నిజాలను నిగ్గు తేల్చడానికి చిన్నపాటి వ్యక్తులను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు వినికిడి. కిడ్నీ రాకెట్ లో అసలు సిసలైన దొంగల ముఠాను పట్టుకోలేక పోతున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కిడ్నీ రాకెట్ ముఠా వ్యవహారం విశాఖ నుండి విజయవాడ, తిరుపతి, మదనపల్లె, బెంగుళూరు, గోవా వరకు ఉందంటే ఈ రాకెట్ లో సూత్ర, పాత్రధారులు వివిధ రాష్ట్రాల్లో మానవ అవయవాల అక్రమ రవాణా చేసే హేమా హేమీలై ఉంటారనేది తేటతెల్లం. లోకల్ గా ఉన్న పోలీసులతో దర్యాప్తును కొనసాగిస్తే కేసును చేదించలేరని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మదనపల్లెలో 21 మంది ప్రభుత్వ డాక్టర్లకు సొంతంగా ప్రైవేట్ ఆస్పత్రులు

మదనపల్లెలో ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే డాక్టర్లకు సొంతంగా 20వక్క ఆసుపత్రులు ఉండడం కళకళ రేపుతోంది. ప్రభుత్వం నుంచి లక్షలకు లక్షలు జీతాలు తీసుకుని రెండు గంటల సమయం కూడా రోగులకు వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు మొగ్గు చూపని పరిస్థితి. జీతం తీసుకునేది ప్రభుత్వం వద్ద, ఎక్కువ సమయం దర్జాగా విధులు నిర్వర్తించేది వారి సొంత ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లీనిక్ లలోనే… ఆపరేషన్ల సైతం ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో కుమ్మక్కై లక్షలకు లక్షలు దండుకుంటూ ప్రభుత్వ వైద్యులు చేస్తున్నా, జిల్లా యంత్రాంగం కళ్ళుండి చూడలేని కబోదిలా తయారయింది. రెండేళ్లుగా మదనపల్లిలో కార్పొరేట్ తరహా ఆసుపత్రులు విచ్చలవిడిగా వెళతాయి. వాటికి కనీస సౌకర్యాలు వసతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేశారు. ఈ ఆస్పత్రుల కేంద్రంగానే పేదలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఆస్పత్రికి ఓపిక వెళ్లిన 10,000 లకు పైనే ముట్టజెప్పి రావాల్సిన దుస్థితి మదనపల్లిలో నెలకొంది. పర్యవేక్షించి, అక్రమాలను అరికట్టాల్సిన జిల్లా స్థాయి అధికారులు ఏడాదికి ఒకసారి తూతూ మంత్రంగా ఇలా వచ్చి గుట్టు చప్పుడు కాకుండా అలా వెళ్ళిపోయి. మామూళ్ల మత్తులో అన్ని బెష్ గా ఉన్నాయని పరోక్షంగా ప్రైవేట్ వైద్యుల మాఫియాకు ఊతమిస్తున్నారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి జిల్లా స్థాయి అధికారులు నీతిమంతులుగా వ్యవహరించి అవినీతిపై బ్రహ్మాస్త్రం ఉపయోగించకపోతే వారి జాబితాలో జిల్లా స్థాయి అధికారులు కూడా నిలిచిపోతారని పలువురు ఆరోపిస్తున్నారు.