భారత్ న్యూస్ రాజమండ్రి…బీసీ జనగణన తర్వాతే స్థానిక ఎన్నికలు: హైకోర్టులో పిల్
అమరావతి :
ఏపీలో బీసీ జనగణన పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. SC, STలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, కానీ బీసీలకు ఆ నియమాన్ని పాటించడం లేదని, 1986 తర్వాత బీసీ జనగణన జరగలేదని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు తెలిపారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టనుందని సమాచారం.
