రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్: ఫతి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్: ఫతి
తెలంగాణ : రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. రూ.10 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్‌ బకాయిల్లో రూ.5,000 కోట్లు విడుదల చేసేదాకా కాలేజీల నిరవధిక బంద్‌ కొనసాగుతుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హైయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (FATHI) స్పష్టంచేసింది. రూ.5,000 కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకూ కాలేజీల బంద్‌ పాటిస్తామని ఫతి చైర్మన్‌ నిమ్మటూరి రమేశ్‌బాబు తేల్చిచెప్పారు