భారత్ న్యూస్ విశాఖపట్నం..Pakisthan తో సంబంధాలకు సంబంధించి విశాఖపట్నం నేవీ గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ NIA India ప్రత్యేక కోర్టు మరో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించింది. విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టు ఇద్దరు నిందితులకు 5 సంవత్సరాల 10 నెలల జైలు శిక్షను, ఐదు వేల రూపాయల జరిమానా విధించింది.

దీనితో, ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి శిక్ష విధించినట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది