అయ్యో దేవుడా.. పండించిన పంటంతా నీటిపాలైంది..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….అయ్యో దేవుడా.. పండించిన పంటంతా నీటిపాలైంది..
కష్టమంతా కళ్లముందే కొట్టుకుపోయింది..
ఏ రైతుకన్నా ఇంతకంటే గుండెకోత ఉంటుందా..!
6 నెలల కష్టం ఒక్క వర్షానికి నాశనమైపోయింది..
రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట.. ఒక్క గాలివానకు నేలపాలైతే.. ఆ రైతు మానసికంగా ఎంత కుంగిపోతాడో చెప్పడానికి నిదర్శనం కరీంనగర్‌లో జరిగిన ఈ దృశ్యాలు.. అందుకే.. మార్కెట్‌లోకి అధికారులు రాగానే బోరుమంది ఆ మహిళా రైతు.. కాళ్లపై పడింది.. తనకు దిక్కెవరంటూ ఆవేదనతో ప్రశ్నించింది. చాలాచోట్ల రైతులు ధాన్యాన్ని ఒకచోట కుప్పగా నేర్పి పరదాలు కప్పి వెళ్లినప్పటికీ కుండపోత వానతో నీళ్లు లోపలికి వెళ్లి వడ్లు తడిసిపోయాయి.