భారత్ న్యూస్ విజయవాడ…మొంథా’ తుఫాను నేపథ్యంలో పులిగడ్డలో టీడీపీ నేతల పర్యటన
మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో… అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతలు పర్యటించారు. టీడీపీ నాయకులు స్థానిక ప్రజలను కలిసి తుఫాను గురించి అప్రమత్తం చేశారు.విద్యుత్, తాగునీరు సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామం లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళాలని అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని ప్రజలకు వివరించారు ప్రజలు ధైర్యంగా ఉండాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను, అధికారులు ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. తుఫాను పరిస్థితులు మెరుగుపడే వరకు టీడీపీ కార్యకర్తలు ప్రజలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, మండలి రామ్మోహన రావు,పర్చూరి దుర్గాప్రసాద్, బండే రాఘవ, గుంటూరు వినయ్,నాగిడి రాంబాబు, చెన్ను బాబురావు,కొల్లూరి వాసు, కమ్ములి సుబ్రమణ్యం, నాగిడి వెంకటేశ్వరరావు, నాగిడి శివ నాగేశ్వరరావు,నాగ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
