శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రభుత్వ పాఠశాల నుందు అదృశ్యమైన ముగ్గురు బాలికలను పోలిసులు పట్టుకున్నారు

భారత్ న్యూస్ అనంతపురం…శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రభుత్వ పాఠశాల నుందు అదృశ్యమైన ముగ్గురు బాలికలను పోలిసులు పట్టుకున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం పాఠశాల ముగియగానే ఇంటికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు. తమ పిల్లలు ఎంత సేపటికి రాకపోవడంతో బంధువులు,స్నేహితుల ఇళ్లలో ఆరా తీయగా బాలికల ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై మక్బుల్ బాషా సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. బాలికలు తనకల్లు నుండి ఆర్టీసీ బస్సులో మొలకలచెరువుకు వెళ్లి అక్కడ తన మిత్రులతో కలిసి అనంతపురం వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి బాలికలను పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.తప్పిపోయిన ఏడు గంటల్లోనే తమ పిల్లలను తమకు అప్పగించడంతో పోలీసులు స్పందించిన తీరుపై తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు