లులూ షరతులపై పవన్ కౌంటర్‌ – గోవధకు తాము వ్యతిరేకం!”

భారత్ న్యూస్ విశాఖపట్నం..లులూ షరతులపై పవన్ కౌంటర్‌ – గోవధకు తాము వ్యతిరేకం!”Ammiraju Udaya Shankar.sharma News Editor…

  1. “లులూ లాజిక్‌పై పవన్ లెవల్ ప్రశ్నలు – మేం వ్యతిరేకం అని తేల్చి చెప్పిన పవన్!”
  2. “లులూ డిమాండ్స్‌ పై పవన్ ఆగ్రహం – గోవధ చేస్తే అస్సలు వీల్లేదు !”
  3. ” లులూ పై పవన్‌ సూటి మాటలు – ప్రభుత్వానికే అవసరం ఉన్నట్టు వ్యవహరించొద్దు!”
  4. ” లులూ షరతులు అతి! – కేబినెట్‌లో పవన్‌ గట్టి వాదన”
  5. ” లులూ కండీషన్లపై పవన్ ఫైర్ – స్థానికులకు ఉద్యోగాలు తప్పనిసరి!”
  6. ” లులూ వ్యవహారశైలి పట్ల పవన్ ఆగ్రహం – గోవధ అనుమతి అస్సలు లేదు!”

లులూ.. ఏంటీ అతి, అలా జరిగితే మేం వ్యతిరేకం – తేల్చి చెప్పిన పవన్ ..!!

ఏపీమంత్రివర్గ సమావేశంలో ఆసక్తి కర చర్చ చోటు చేసుకుంది. లులూ గ్రూప్‌కు భూకేటాయింపుపై మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. లులూ సంస్థ తమ పెట్టుబడుల విషయంలో కోరుతున్న అంశాలు..

షరతుల పైన అధికారులు వివరించారు. లులూ సంస్థ ప్రతిపాదించి వాటి పైన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వరుస ప్రశ్నలు సంధించారు. సందేహాలు లేవనెత్తారు. మెగా ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా అని ప్రశ్నించారు. అలా చేస్తే తాము వ్యతిరేకమని పవన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. అదే విధంగ లులూ లో ఉద్యోగాల పైన పవన్ కీలక సూచనలు చేసారు.

ఏపీ కేబినెట్ భేటీలో లులూ సంస్థకు కేటాయింపులు.. మినహాయింపుల పైన చర్చ జరిగింది. ఈ చర్చ సమయంలో కృష్ణాజిల్లా మల్లవల్లి మెగా ఫుడ్‌ పార్కులో లులూగ్రూప్‌లో భాగమైన మెస్సర్స్‌ ఫెయిర్‌ ఎక్స్‌పోర్ట్స్‌కు 7.48ఎకరాలను కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దీంతో ఆహారశుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా? అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించినట్లు సమాచారం. ఆహారాన్నే శుద్ధి చేస్తారని అధికారులు బదులివ్వగా .. ఆహారశుద్ధి అని ఊరికే అంటే కుదరదు… అక్కడ అసలు ఏం పని చేస్తారు..కూరగాయలు, పండ్లు సాగుచేస్తారా.. ఉద్యానవన పంటలు సాగుచేస్తారా.. లేక కబేళాను నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్‌ సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం.

ఇదే సమయంలో గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని పవన్ తేల్చి చెప్పారు స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతో.. అధికారులు నీళ్లు నమిలారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లేదని, అలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టంచేసినట్లు సమాచారం. అక్కడ ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మామిడి, బొప్పాయి వంటి పండ్లు మాత్రమే ప్రాసెస్‌ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత లులూ గ్రూప్‌ వ్యవహారశైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్‌ అగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలను పవన్‌ ప్రస్తావించారు.

లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5 శాతం మాత్రమే పెంచడం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం 3 ఏళ్లకు 10 శాతం పెంచాలి కదా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

జోక్యం చేసుకున్న పవన్..లులూ గ్రూప్‌ చాలా అతిగా కండీషన్లు పెడుతోందని, ప్రభుత్వానికే తన అవసరం ఉందన్నట్లుగా వ్యవహరిస్తోందని పేర్కొన్నట్లు తెలిసింది. విశాఖపట్నం, విజయవాడల్లో ఆ సంస్థకు ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. లులూ గ్రూప్‌కు ప్రభుత్వమే భూములు ఇస్తోంది.. కానీ… షరతులు ఆ కంపెనీ పెడుతోందని పవన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రెంటల్ అగ్రిమెంట్స్ పైన లులూ చెబుతున్న అంశాల పైన పవన్ వరుస ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. లులూ ఏర్పాటు చేసే మాల్స్‌, సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంపైనా పవన్‌ ప్రశ్నించారు. విశాఖ, విజయవాడలో లులూ గ్రూప్‌ ఏర్పాటు చేసే మాల్స్‌లో ఆ కంపెనీ తన సొంత మనుషులనే సిబ్బందిగా నియమించుకుంటుందని విన్నామని.. ఇక్కడా అదే జరిగితే ఇక్కడ భూములు ఇచ్చి ఏం లాభం.. కచ్చితంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పవన్ స్పష్టం చేసినట్లు సమాచారం.