భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికాతో కలిసి పాక్ ఓడరేవు నిర్మాణం
Oct 05, 2025,
అమెరికాతో కలిసి పాక్ ఓడరేవు నిర్మాణం
పాకిస్తాన్ – అమెరికాతో కలిసి అరేబియా సముద్రంలో ఒక కొత్త ఓడరేవును నిర్మించాలని ప్రతిపాదన చేసింది. బలూచిస్తాన్‌లోని పస్ని పట్టణంలో ఈ సివిల్ పోర్టును నిర్మించాలని పాక్ భావిస్తోంది. బలూచిస్తాన్‌లోని ఖనిజ సంపదను రవాణా చేయడానికి ఇది ఉపయోగపడుతుందని పాకిస్తాన్ ఆశిస్తోంది. ఈ ఓడరేవు నిర్మాణం చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టుకు 100 కి.మీ దూరంలో, ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు 300 కి.మీ దూరంలో ఉంటుంది.
