జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు

భారత్ న్యూస్ విజయవాడ…జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు

జాతీయ హైవేపై ఆయా రహదారుల సమాచారం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు తెలిపేలా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. ఈ క్యూఆర్ కోడ్‌లో సదరు రహదారుల ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారంతో పాటు నేషనల్ హైవే నంబర్, హైవే ఛైనేజ్, ప్రాజెక్ట్ పొడువు వివరాలను తెలియజేస్తాయి. ఇందులో హైవే గస్తీ, టోల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజినీర్ల నంబర్లు, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 1033, పెట్రోల్ బంక్, ఆస్పత్రుల వివరాలు ఉంటాయి….