తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బి. శివధర్ రెడ్డి గారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బి. శివధర్ రెడ్డి గారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శివధర్ రెడ్డి గారు నియామక ఉత్తర్వులను అందుకున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రస్తుతం డీజీపీ (ఇంటెలిజెన్స్)గా పనిచేస్తున్న శివధర్ రెడ్డి గారు రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సందర్భంగా ముఖ్యమంత్రి గారు వారికి అభినందనలు తెలిపారు.