.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో వాహన మిత్ర రూ.15వేలు.. అక్టోబర్ 2వ తేదినే!!
అమరావతి :
ఏపీ రాష్ట్రంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందించేందుకు మొత్తం 3,10,385 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అక్టోబర్ 2న అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారు.ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి రూ.466 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్ గా ఉండాలని, ఇతర గూడ్స్ వాహనాలకు ఈ స్కీం వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.
