జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ట్రైనీ ఐఏఎస్

భారత్ న్యూస్ గుంటూరు…జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ట్రైనీ ఐఏఎస్

ఐఏఎస్ ట్రైనింగ్ నిమిత్తం లో భాగంగా కృష్ణాజిల్లా కు వచ్చిన ట్రైన్ ఐఏఎస్ శ్రీ ఫర్హీన్ జాహిద్ గారు జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారిని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

🔹ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు పోలీస్ శాఖ యొక్క పనితీరు, నేర నివారణ, మహిళా-శిశు భద్రత, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రజా భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అవగాహన కల్పించారు.

🔹అలాగే జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు, జనసహకారంతో అమలు చేస్తున్న నేర నియంత్రణ చర్యలు, శాంతి భద్రతా పరిరక్షణకు ఉపయోగించే సాంకేతికత వినియోగం గురించి వివరించారు.

🔹 పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ పరస్పర సమన్వయం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం మరింత సులభతరం అవుతుందని తెలిపారు.

▪️శిక్షణ ఐఏఎస్ అధికారి గారు జిల్లా పోలీస్ శాఖ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో పోలీస్ శాఖ యొక్క సమన్వయంతో మరింత ప్రజా సేవ చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.