ఇవాళ భారత్, పాక్ మధ్య చర్చలు

భారత్ న్యూస్ రాజమండ్రి….ఇవాళ భారత్, పాక్ మధ్య చర్చలు

ఈ రోజు భారత్-పాక్‌ మధ్య డీజీఎంవోలు చర్చలు జరగనున్నాయి. కాల్పుల విరమణతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో అసలు ఈ ఒప్పందాన్ని కొనసాగించాలా లేక ఏం చేయాలి అనే దానిపై మాట్లాడనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులతో పాటు సురక్షిత అంశాలపై చర్చ సాగనుంది. అయితే భారత్- పాక్‌ తీసుకునే నిర్ణయాలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది…