భారత్ న్యూస్ గుంటూరు…రాష్ట్రాలకు అప్పుల డేంజర్ బెల్స్.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు
పదేళ్లలో మూడింతలకు పైగా పెరిగిన రాష్ట్రాల అప్పులు
రూ.17.57 లక్షల కోట్ల నుంచి రూ.59.60 లక్షల కోట్లకు చేరిన రుణభారం
పెట్టుబడులకు బదులు రెవెన్యూ లోటు పూడ్చేందుకే అనేక రాష్ట్రాలు రుణాలు
ఈ జాబితాలో ఏపీ సహా 11 రాష్ట్రాలు ఉన్నాయని వెల్లడించిన కాగ్
అప్పుల నిష్పత్తిలో పంజాబ్ టాప్.. మెరుగైన స్థానంలో ఒడిశా
దేశంలోని రాష్ట్రాలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, గత దశాబ్ద కాలంలో వాటి రుణభారం ఏకంగా మూడింతలు పెరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తొలిసారి విడుదల చేసిన దశాబ్ద విశ్లేషణ నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
కాగ్ అధిపతి కె. సంజయ్ మూర్తి రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశంలో ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 28 రాష్ట్రాల మొత్తం అప్పులు రూ.17.57 లక్షల కోట్లుగా ఉండగా, 2022-23 నాటికి అది రూ.59.60 లక్షల కోట్లకు చేరింది.
