.భారత్ న్యూస్ అమరావతి..విశాఖ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు ప్రసంగం :

Ammiraju Udaya Shankar.sharma News Editor…వివిధ వ్యాపార ఆలోచనలతో యువత ముందుకొచ్చింది. మహిళల భద్రతలో విశాఖ అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల సర్వేలో తేలింది. విశాఖలో అద్భుత వాతావరణం ఉంది.. సముద్రం, అందమైన కొండలు ఉన్నాయి. అరకు కాఫీ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. 1991 లో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారు. రెండో తరం సంస్కరణలను నేను తీసుకువచ్చాను. ఏపీకి చెందిన ఆర్థిక మంత్రి దేశ పురోగతిలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. సరైన సమయంలో.. సరైన నాయకుడు ప్రధాని మోదీ. 75 వ జన్మదినం జరుపుకుంటున్న మోదీకి శుభాకాంక్షలు. ప్రధాని మోదీ దేశానికి అతి పెద్ద ఆస్తి. గత నాయకులు టెలికామ్ రంగంలో సంస్కరణలు చేపట్టలేదు. వాజ్ పేయీ హయాంలో టెలికామ్ రంగంలో సంస్కరణలు మొదలయ్యాయి. మౌలిక సౌకర్యాల రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ఐటీ రంగంలో భారత్ చాలా బలంగా ఉంది. గణితం, ఆంగ్లంలో ముందుండడం కలిసి వస్తోంది. మన ప్రాంతానికి చెందిన కోహినూర్ వజ్రం ఇంగ్లాండ్ లో ఉంది. కోహినూర్ వజ్రాన్ని వెనక్కి ఇచ్చే ప్రతిపాదనను ఇంగ్లాండ్ తిరస్కరించింది. ఉద్యోగాలు ఇచ్చే విధంగా యువత తయారు కావాల
