దేవరకొండ ఫాన్స్ కి క్రేజీ న్యూస్.. ఆ రెండు సినిమాల రిలీజ్ అప్పుడే..

స్టార్ హీరో విజయ్ దేవరకొండ మే 9న పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో జరుపుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో అయితే.. సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషేష్ తెలియచేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెల 30న కింగ్ డమ్ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా విజయ్ నుంచి రెండు సినిమాలకు సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు. ఇంతకీ.. విజయ్ ఇచ్చిన అప్ డేట్ ఏంటి..?

విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఎస్ వీసీ 59 మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇంటెన్స్ గా ఉండి ఆకట్టుకుంటోంది. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.

ఇక మరో అప్ డేట్ ఏంటంటే…విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ వీడీ 14. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. విజయ్ సరసన రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో ధ్యానముద్రలో ఉన్న విజయ్ దేవరకొండ స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది.

బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని కథాంశంతో వీడీ 14 ఒక పవర్ ఫుల్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలు వైవిధ్యమైనవే. మరి.. ఏ స్థాయి విజయం సాధిస్తాడో చూడాలి.