మెగా హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా…?

ప్రశాంత్ వర్మ అ అనే సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు.. రాజశేఖర్ తో కల్కి, తేజ సజ్జతో జాంబిరెడ్డి, హనుమాన్ సినిమాలు తెరకెక్కించాడు. అయితే.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో ప్రశాంత్ వర్మకు డిమాండ్ బాగా పెరిగింది. బాలీవుడ్ స్టార్స్ సైతం ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమాను ప్రకటించారు కానీ.. ఇంత వరకు అప్ డేట్ లేదు. ఇప్పుడు మెగా హీరోతో సినిమా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఎవరా మెగా హీరో.? ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు…?

ప్రశాంత్ వర్మ.. హనుమాన్ మూవీ తర్వాత మోక్షజ్ఞ సినిమాను పట్టాలెక్కించాలి అనుకున్నాడు కానీ.. ఇంత వరకు ఆ సినిమా స్టార్ట్ కాలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆతర్వాత ప్రశాంత్ వర్మ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బ్రహ్మరాక్షస అనే సినిమా చేయబోతున్నాడని టాక్ వచ్చింది. మేటర్ ఏంటంటే.. ప్రశాంత్ వర్మ చెప్పిన కథ ప్రభాస్ కు విపరీతంగా నచ్చేసిందట. సినిమా చేద్దామని మాట ఇచ్చాడట. అయితే.. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుచేత ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతుంది.

అందుకనే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో కాంతార హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాను అఫిసియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. ఓ వైపు జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మరో వైపు నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ ను కలిసి కథ చెప్పాడట. ఈ కథ నచ్చడంతో ఓకే చెప్పాడని.. ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అంటూ ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తో ఓ మూవీ ప్లానింగ్ లో ఉంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మతో సినిమా ఉంటుందని టాక్. మరి.. ఏం జరగనుందో చూడాలి.