యూరియా సరఫరా నిమిత్తం రైతులు అనవసర ఆందోళన చెందవద్దు – జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్.,

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా పోలీస్

A. Udaya Shankar.sharma News Editor…యూరియా సరఫరా నిమిత్తం రైతులు అనవసర ఆందోళన చెందవద్దు – జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్.,

కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా నిరంతరాయంగా, ఎటువంటి అంతరాయం లేకుండా జరుగుతోంది. ఇప్పటివరకు 5,881 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు 2640 మెట్రిక్ టన్నులు జిల్లాకు వచ్చింది.
యూరియా సరఫరా గురించి రైతులు ఎటువంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు.

వారి అవసరాలకు తగినట్టు టోకెన్ విధానం ద్వారా సరఫరా కొనసాగుతోంది. అర్హత ప్రకారం ప్రతి రైతుకూ సరైన పరిమాణంలో యూరియా అందించేందుకు చర్యలు తీసుకోబడుతున్నాయని జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐపీఎస్., గారు తెలియజేశారు.

అనధికారంగా యూరియాను నిలువ చేసినా , అక్రమ రవాణా కి పాల్పడినా, సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో అవాస్తవ ప్రచారం చేసినా, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
ప్రజలు ఇలాంటి సమాచారం వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ కు తెలియజేయాలి.

అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో టోకెన్ సిస్టం అమలు చేయబడింది. నిఘా పెంచబడింది. రైతుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తుంది

కాబట్టి, కృష్ణా జిల్లాలోని రైతులు ఎటువంటి అపోహలకు, ఆందోళనలకు గురికావలసిన అవసరం లేదు. అధికారిక మార్గాల ద్వారా సరఫరా సక్రమంగా జరుగుతుందని తెలియజేస్తున్నాం.

ఆర్ గంగాధరరావు, ఐపీఎస్.,
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణాజిల్లా