భారత్ న్యూస్ విశాఖపట్నం..విశ్వనాధపల్లి పీఏసీఎస్ వద్ద రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న కనపర్తి శ్రీనివాసరావు
రైతుల అవసరాల మేరకు యూరియా సరఫరాకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉన్నప్పటికీ కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వంగా ఉన్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతులకు ప్రణాళికతో యూరియా సరఫరా చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వనాధపల్లి పీఏసీఎస్ ప్రెసిడెంట్ తోట సాంబశివరావు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, కొప్పనాతి వెంకటేశ్వరరావు,తోట వెంకట సూర్య నరసింహారావు,కర్రా సుధాకర్, కురాకుల శివ ప్రసాద్ మరియు రైతులు పాల్గొన్నారు.
