భారత్ న్యూస్ ఢిల్లీ…..నెహ్రు, ఇందిరా, రాజీవ్ లేకుంటే భారతదేశాన్ని ఊహించలేము : జగన్ మురారి.
నెహ్రు వల్లే ఈ దేశం నాశనమైపోయిందని కొంతమంది మాట్లాడుతున్నారు, బీజేపీ నెహ్రు కుటుంబం మీద, కాంగ్రెస్ మీద విష ప్రచారం చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మురారి అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి దేశ బడ్జెట్ 500 కోట్లు మాత్రమే, రాజ్యాంగ నిర్మాణం కాలేదు, ప్రపంచ దేశాల నుండి సంబంధాలు లేవు, సరిహద్దు దేశాలు భారత్ ని కబలించడానికి కుట్రలు చేస్తున్నాయి, దేశంలో తినడానికి ప్రజలకు తిండి లేదు, ఉపాధి లేదు, టెక్నాలజీ వినియోగం లేదు. అలాంటి పరిస్థితుల నుండి భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా నిలబెట్టాడు, ప్రపంచ దేశాలు భారత్ గురించి మాట్లాడుకునేలా చేసాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాడు, ఆయన బాటలోనే ఇందిరా, రాజీవ్ నడిచారు. కడుపు నిండాక నెహ్రుని, కాంగ్రెస్ ని విమర్శించడం దుర్మార్గం, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి, కాంగ్రెస్ దేశ సమైక్యత కోసం కృషి చేస్తుంది, బీజేపీ దేశాన్ని విచ్చిన్నం చేస్తుందని జగన్ మురారి అన్నారు.
