భారత్ న్యూస్ మచిలీపట్నం…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో నేటి మధ్యాహ్నం నుంచి డీఎస్సీ రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన
అమరావతి:
మెగా డీఎస్సీకి సంబంధించిన రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం మధ్యాహ్నం నుంచి చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీల నలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో కొత్తవారికి, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ అభ్యర్థులు, గతంలో కాల్ లెటర్లు రాకుండా మిగిలిన పోస్టులకు కాల్ లెటర్లు విడుదల చేయనుంది. కాల్ లెటర్లు జారీ చేసిన అనంతరం మంగ ళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనుంది. ఒకవేళ కాల్ లెటర్ల జారీ ఆలస్యమైతే బుధవారం ఉదయం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు 900 మంది వరకు ఉండనున్నారు. దివ్యాంగ అభ్యర్థులు 120 మంది వరకు ఉండగా.. వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మెడికల్ బోర్డుకు వెళ్లాల్సి ఉంటుంది. రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలనలో ఎవరైనా తిరస్కరణకు గురైతే వారి స్థానంలో కొత్త వారికి మూడో విడతలో కాల్ లెటర్లు జారీ చేస్తారు.
