భారత్ న్యూస్ అనంతపురం….మంత్రి ఆదేశాలతో మొదలైన చెరువు కట్ట పనులు
సోమందేపల్లి : రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని, రైతుల ఆనందమే తమ ధ్యేయమని ముందుకెళ్తున్నారు మంత్రి సవిత, గత పాలకుల నిర్లక్ష్యం వలన ముళ్ళ పొదలతో నిండిపోయిన సోమందేపల్లి చెరువు కట్టకు పూర్ వైభవం తీసుకురానున్నారు కూటమినేతలు, శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని చెరువు ఆయకట్టు పైన ముళ్లపోదులతో, పిచ్చి మొక్కలతో అస్తవ్యస్తంగా తయారయింది, చెరువు తూము నుండి రైతుల పంట పొలాలకు నీరు వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా మారడంతో మంత్రి సవిత దృష్టికి రైతులు ఈ సమస్యలు తీసుకెళ్లారు, వెంటనే స్పందించిన మంత్రి సబితా హుటాహుటిన రైతులకు ఇబ్బందిగా మారిన ముళ్లపోదలను తొలగించాలని కూటమనేతలకు ఆదేశించడంతో ఆదివారం ఉదయం హిందూపురం పార్లమెంట్ తెదేపా కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్, కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు వడ్డే సూరి, ఆయకట్టు అధ్యక్షుడు వడ్డే నారాయణ ఆధ్వర్యంలో చెరువు కట్టమీద మీద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేసి అనంతరం ముళ్ళపోదలు, కంప చెట్లు తొలగింపు పనులు ప్రారంభించారు, ఈ సందర్భంగా నీరుగంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతుల పడుతున్న కష్టాలను మంత్రి సవితమ్మ దృష్టికి వెళ్లడంతో వెంటనే చెరువు కట్ట మరమ్మత్తులు, ముళ్లపొదలు తొలగించడానికి లక్ష రూపాయలు మంజూరు చేశారని, గత పాలకుల నిర్లక్ష్యంతో చెరువు కట్ట ముళ్లపోదలతో నిండిపోయి కట్ట ప్రమాద స్థాయికి చేరి, రైతుల పంట పొలాలకు నీళ్లు వెళ్ళే దారికి మనుగడ కష్టమైందని, రైతుల సంక్షేమం కోసం యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టమన్నారు, చెరువు కట్టమీద పెరిగిన ముళ్ళపోదలు, కంప చెట్లను తొలగించి చెరువు కట్టకు పూర్వం తీసుకొస్తామని, అదేవిధంగా 50 లక్షల రూపాయలతో సోమందేపల్లి చెరువు అభివృద్ధి పనులు త్వరలో చేపడతామని, చెరువు మరమ్మత్తులకు మంత్రి సవిత ప్రతి పాదనలు సిద్ధం చేయమని అధికారులకు ఆదేశించారని, త్వరలో సోమందేపల్లి చెరువు లో మరమ్మత్తు పనులు కూడా ప్రారంభించి చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు, గత పాలకులు అభివృద్ధిని మరిచారని, కూటమి ప్రభుత్వం అటు రాష్ట్రంతో పాటు ప్రతి గ్రామంలోని రైతుల ఆనందం కోసమే పాటుపడుతుంది అనడానికి ఇదే నీ దర్శనం అని మంత్రి సవిత చొరవతో ఈ పనులు చేపట్టామని, ఈ సందర్భంగా రైతులందరూ కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు, ఈ కార్యక్రమంలో చెరువు ఆయకట్ట అధ్యక్షుడు వడ్డే నారాయణ, ఉపాధ్యక్షుడు సాయినాథ్ రెడ్డి, డైరెక్టర్లు, మాజీ ఎంపీటీసీలు కిష్టప్ప, ప్రభాకర్, నాగ శేషప్ప, నగేష్, తిప్పన్న, కిష్టప్ప, గాండ్ల నబి,మద్దిలేటి, హేమంత్, స్టోర్ డీలర్లు ఈడిగా శ్రీనివాసులు, తూముకుంట బాలు, పెద్ద కోడి పల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు…
