భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించిన తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు
వాయిదా తీర్మానం ప్రతిపాదనను లోకసభ సెక్రెటరీ జనరల్‌కు పంపిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిన కేంద్రం
ఆగస్టు 13వ తేదీ వరకు 6.60 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని చామల వెల్లడి
కానీ, ఇప్పటివరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయినట్లు పేర్కొన్న చామల
తద్వారా రాష్ట్రంలో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని, పంటలకు అవసరమైన యూరియా దొరకక రైతుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు వెల్లడించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి..