
వేసవి వచ్చేసింది… ప్రతి సీజన్ లానే ఈ సీజన్‌లోనూ వైరల్ ఫీవర్‌లు, జ్వరాలు లాంటి రకరకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువ.. అందువల్ల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వేసవిలో తినే ఆహారం.. ఇతర సీజన్‌లలో తినే ఆహారాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యకరమైన ఆహారం, ద్రవ పదార్థాలను తీసుకోవాలని హెల్త్ నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటంటే..
- దాహం వేసినప్పుడు కాకుండా.. ఎప్పటికప్పుడు మంచినీరు తాగాలి. రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు నీరు తాగాలి.
- నిమ్మరసం, గంజి నీరు, మెరినేడ్ వాటర్, జీలకర్ర నీళ్లు వంటి మినరల్ కంటెంట్ తో నీటిని రెగ్యులర్ గా తాగాలి.
- కడుపు నిండా తినకుండా.. విరామం ఇస్తూ ఇంటర్ మిడియంట్ గ్యాప్ లెవల్ లో భోజనం తినడం ఉత్తమం.
- తినే ఆహారంలో నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి.
- చర్మ వ్యాధులు, విటమిన్ లోపాన్ని తగ్గించుకునేందుకు రోజూ పండ్లు తినాలి.
- ఈ సీజన్ లో సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మ, ముసాంబి), పుచ్చకాయ, దానిమ్మ, సీతాఫలాలను తీసుకోవడం మరింత మేలు చేస్తుంది.
- పైనాపిల్ కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది.
- మామిడి పండ్లలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులనుంచి బయటపడొచ్చు.
- సూర్యరశ్మి/ అధిక ఉష్ణోగ్రతల వల్ల చర్మంపై ఏర్పడే చర్మ సమస్యలను తగ్గించడంలో బొప్పాయి హెల్ప్ చేస్తుంది.
- మధ్యమధ్యలో వెజిటబుల్ సలాడ్ తినడం తప్పనిసరి.
- అధిక కొవ్వు పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.. ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్వీటెన్డ్ పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
- ఎక్కువ కారం, పులుపు అధికంగా ఉండే ఆహార పదార్థాల వాడకం తగ్గించాలి. వీటిని ఎక్కువగా వాడటం వల్ల అజీర్తి సమస్య అనేది వస్తుంది.
- ఈ సీజన్ లో టీ, కాఫీకి బదులు.. పండ్ల రసాలు, కూరగాయల సూప్‌లు తీసుకోవచ్చు.
- వేసవిలో మీ శరీరం డ్రై అయిపోయి… ట్యాన్ ఎక్కువై.. కళావిహీనంగా కాకుండా, కాంతివంతంగా మార్చేందుకు మంచినీళ్లు బాగా తాగాల్సి ఉంటుంది. మాంసం, గుడ్లు.. వంటివి ఫ్రై చేసుకొని తినడం కూడా తగ్గించడం ఉత్తమం.
- తీపి పదార్థాలు.. చక్కెర అధికంగా ఉన్న ఫుడ్స్ తినడం తగ్గించాలి.
- వేసవిలో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం.. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మేలు చేస్తుంది. వీటితోపాటు ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా వేసవిలో హెల్తీగా ఉండొచ్చు.