చెమట పట్టడం.. మంచిదేనట..?!

వేసవిలో చెమట పట్టడం అనేది అందరికీ కామన్.. కానీ చాలామంది తమకు చెమటలు పట్టడం చూసి భయపడిపోతుంటారు. ఇది అసలు అనారోగ్య సమస్యా..? కాదా..? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఈ వేసవిలో శరీరానికి చెమటలు పట్టడం అనేది ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. ఒక మంచి రోగనిరోధక వ్యవస్థ నేరుగా చెమటతో మంచి సంబంధం కలిగి ఉండటం వల్ల ప్రతీ వ్యక్తికి సమ్మర్‌లో తప్పనిసరిగా చెమటలు పడతాయి. కాబట్టి సమ్మర్ లో చెమట పట్టడం మంచిదే అంటున్నారు. చెమట పట్టిన ప్రతిసారీ మన శరీరంలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతుందట. దీనివల్ల మన ఆరోగ్యం బెటర్ అయి.. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయట. అంతేకాకుండా చెమట అనేది మన శరీరం నుంచి ఎక్సెస్ సాల్ట్ ను తొలగిస్తుంది. ఇది గుండెకు చాలా మంచిదట. అలాగే చెమట వెళ్లిపోవడంతో మన మనసు రిఫ్రెష్‌గా మారి.. రోగనిరోధక వ్యవస్థ పెరుగుతోంది.

అలాగే చెమట వల్ల మన శరీరంలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు తెరుచుకొని మురికి మలినాలు, బ్లాక్ హెడ్స్, ఆయిల్, మొటిమలు లాంటి సమస్యలను దూరం చేస్తుందట. అందువల్ల చెమట పట్టడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు.

అయితే కొంతమంది భయం, టెన్షన్, ఆందోళన గా ఉన్న సమయంలో కూడా చెమటలు పడతాయి. శారీరక శ్రమ పెరిగినప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, గదిలో గాలి వీచనప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో విపరీతమైన చెమటలు పట్టేస్తుంటాయి. దీంతో కొందరు నాకేదో అయిపోతుందని భయానికి లోనవుతారు. అయితే దీని గురించి అంతలా భయపడాల్సిన పని లేదు. చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్స్ గా ఉంటుందని.. ఈ చెమట ఎలా వచ్చినా అది శరీరానికి మంచిదే, ఒకవేళ అతిగా చెమటలు వచ్చి ఇబ్బందిగా అనిపిస్తే గ్లాస్ వాటర్ తాగాలని సూచిస్తున్నారు నిపుణులు.