మృతులంతా హైదరాబాదీలే : TG హజ్ కమిటీ

.భారత్ న్యూస్ హైదరాబాద్….మృతులంతా హైదరాబాదీలే : TG హజ్ కమిటీ

సౌదీ బస్సు ప్రమాద మృతులంతా హైదరాబాదు చెందిన వారేనని తెలంగాణ హజ్ కమిటీ స్పష్టం చేసింది. ‘4 ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మొత్తం 45మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17మంది పురుషులు, 28మంది మహిళలున్నారు. చనిపోయినవారు మల్లేపల్లి, బజార్ ఘాట్, ఆసిఫ్ నగర్ తదితర ప్రాంతాలకు చెందినవారు’ అని వెల్లడించింది.

ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీలో ఘోర బస్సు ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు వెల్లడించారు.