భారత్ న్యూస్ రాజమండ్రి…కాకినాడ జిల్లా
తుని
తపోవనం ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామీజీ కన్నుమూత
తెల్లవారుజామున ఆశ్రమంలో గుండెపోటుతో స్వామీజీ శివైక్యం
గత కొంతకాలంగా స్వామీజీ అనారోగ్యంతో బాధపడుతున్నారు
రెండురోజుల క్రితమే ఆసుపత్రి నుంచి ఆశ్రమానికి వచ్చిన స్వామీజీ..
ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు
స్వామీజీ మృతితో భక్తుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి
సచ్చిదానంద స్వామీజీ శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థ మహాస్వామి శిష్యరికం చేశారు
ఇవాళ మధ్యాహ్నం స్వామీజీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు
స్వామీజీ భౌతికాయాన్ని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు

తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు వస్తున్నట్లు తెలుస్తోంది….