భారత్ న్యూస్ మంగళగిరి…ఉపరితల ఆవర్తనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ : కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. బుధవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించింది…..
