భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…కాజీపేట మండలం 46వ డివిజన్ మడికొండ ఎస్సీ కాలనీ మహిళా కమ్యూనిటీ హాల్ ప్రక్కన ఉన్న రోడ్డు స్థలం కబ్జాకు గురి అయిందని ప్రజల కోసం గవర్నమెంట్ ఇచ్చిన రోడ్డును కొన్ని కుటుంబాలు కబ్జా చేయడంపై జాంబవ సంఘం సభ్యులు మరియు కాలనీవాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వచ్చి పంచనామా చేసి నిర్ధారణ చేసి నోటీసులు ఇచ్చిన తర్వాత అధికారులపై రాజకీయ పలుకుబడితో ఒత్తిడీ తీసుకువస్తూ అభివృద్ధికి అడ్డుపడుతూ కాలనీ వాసులపై కుల పెద్దలపై అసభ్య పదజాలంతో తిడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని దుర్భాషలాడుతూ బెదిరిస్తున్న విషయమై ఈరోజు హనుమకొండ గ్రీవెన్స్ లో జాంబవ సంఘం అధ్యక్షులు వస్కుల ఆనందం గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరించడం జరిగినది. తక్షణమే ఇట్టి సమస్యను పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది.
ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వస్కుల వెంకటస్వామి,వస్కుల శ్రీను, అరూరి రాజు,బొజ్జ శ్రీను, అరూరి తిరుపతి, రాసమల్ల రాజు, అరూరి ప్రభుదాస్, తదితరులు పాల్గొనడం జరిగింది.
