..భారత్ న్యూస్ హైదరాబాద్…చింతల్లో భారీ డ్రగ్స్ పట్టివేత
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ వద్ద నిషేధిత మత్తు మందు మెత్తఫెటమైన్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎస్ఓటీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి రూ. 63 లక్షల విలువైన 316 గ్రాముల మెత్తఫెటమైన్, రెండు వెయింగ్ మిషన్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు అనుమానాస్పద సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఆయన సూచించారు..