ట్రంప్ టారిఫ్స్ అమెరికన్లకే ఎక్కువ నష్టం: SBI

భారత్ న్యూస్ ఢిల్లీ…..ట్రంప్ టారిఫ్స్ అమెరికన్లకే ఎక్కువ నష్టం: SBI

ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ ప్రపంచ దేశాలే కాదు సొంత దేశస్థులూ నష్టపోనున్నారు. సుంకాల ప్రభావం అమెరికన్లపై భారీగా ఉంటుందని SBI రిపోర్ట్ వెల్లడించింది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల అక్కడి కుటుంబాల వార్షిక సగటు ఖర్చు రూ.2లక్షల మేర పెరుగుతుందని పేర్కొంది. దీంతో ఇండియా కంటే US ఆర్థిక వ్యవస్థకే ఎక్కువ నష్టం కలగొచ్చని అంచనా వేసింది. ఈ గ్లోబల్ క్రైసిస్ను ఎదుర్కొనేందుకు IND సిద్ధంగానే ఉందని అభిప్రాయపడింది.