దేశంలో సగం విమానాల్లో సాంకేతిక లోపాలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశంలో సగం విమానాల్లో సాంకేతిక లోపాలు

🛫దేశంలో డొక్కు విమానాలతో విమానయాన సంస్థలు ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్నాయి. దేశంలోని 50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ సివిల్‌ ఏవియేషన్‌ వెల్లడించింది.

🛫గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఏడాది కాలంగా 754 విమానాల్లో తనిఖీలు చేపట్టగా 377 విమానాల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. ఆడిట్‌ చేసిన వాటిలో ఇండిగో విమానాల సంఖ్య ఎక్కువని, లోపాలు కూడా అందులోనే ఎక్కువగా కన్పించాయని కమిటీ పేర్కొన్నది.