భారత్ న్యూస్ అనంతపురం .. …ఉపాధ్యాయుడి వేధింపులు.. నిప్పంటించుకున్న విద్యార్థిని
ఒడిశా బాలేశ్వర్ లోని ఫకీర్ మోహన్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అతడిపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆమె కాలేజీ ప్రాంగణంలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. 90 శాతం కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన మరో విద్యార్థి కూడా గాయపడ్డాడు. పోలీసులు ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు…..
