అమెరికా లాంటి దేశాలలోనే లేదు ఈ నిబంధన .

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికా లాంటి దేశాలలోనే లేదు ఈ నిబంధన . పోగాలం , కల్కి కాలం . ఢిల్లీలో ట్రయల్ రన్ . ప్రతిఘటన లేకపోతే దేశమంతా పాకిస్తారు . One Nation-One Rule అని ప్రవచిస్తారు .

వాహనాలు పనికి రాకుండా పోయేది , ఎక్కువ కాలుష్యం విడిచేది వాహనం వయసును బట్టా లేక వాహనం ఇంజన్ కండిషన్ బట్టా ! ఉదాహరణకు నా వాహనం కొని పదిహేనేళ్ళు అయింది . ఇప్పటికి తిరిగింది లక్ష కిలోమీటర్లు . కొందరి వాహనాలు పదేళ్ళకే లక్ష కిలోమీటర్లు తిరగి ఉండవచ్చు .

ఇవ్వాళ మధ్య తరగతి వాళ్ళకు కూడా కార్లు ఉంటున్నాయి . అల్పాదాయ వర్గాల వారికి కూడా బైకులు ఉంటున్నాయి . లైఫ్ టాక్సులు కట్టించుకుంటారు . టోల్ గేట్ల వద్ద పిండి వసూలు చేస్తారు . అయినా రోడ్లను బాగుచేయరు . ట్రాఫిక్ జాంలు కాకుండా చూడలేరు . కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పెట్టరు . ట్రాఫిక్ పోలీసులు ఉండరు .

ట్రాఫిక్ కూడళ్ళ వద్ద , ట్రాఫిక్ ఏరియాలలో ఎంతెంత సేపు వెయిట్ చేపిస్తున్నారు !? ఎంత ఇంధనం వేస్ట్ అవుతుంది ? ఎంత కాలుష్యం వదలపడుతుంది ? అడిగే వారు లేరు . అడిగితే రాష్ట్ర ద్రోహులు , దేశద్రోహులు అంటారు . వేల వేల అటవీ భూములను కొట్టేసి కార్పొరేట్లకు సంతర్పణ చేస్తున్నారు . వాతావరణాన్ని నాశనం చేస్తున్నారు . బనకచర్ల ప్రాజెక్ట్ కోసం నల్లమల అడవులలో సుమారు 11,000 ఎకరాలను నరికేయవచ్చట !!

పాత వాహనాలను బేన్ చేసి వాహనాల ఉత్పతిదారులకు మేలు చేయడం తప్ప మరో మేలు లేదు . ప్రతీ నిర్ణయం కార్పొరేట్ల కొరకు , బడా బడా వ్యాపారస్తుల కొరకు , పారిశ్రామికవేత్తల కొరకు . దేశంలో కార్పొరేట్లు పడ్డారు .

ఒక సామాన్యుడు