.భారత్ న్యూస్ హైదరాబాద్….కూలిన విమానం.. 19 మంది మృతి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విమానం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఢాకాలో మైల్స్టోన్ పాఠశాలపై ఎయిర్ ఫోర్స్కు చెందిన యుద్ధ శిక్షణ విమానం కూలింది. ప్రమాద సమయంలో విద్యార్థులు స్కూళ్లోనే ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది…
