భారత్ న్యూస్ రాజమండ్రి….పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని అరెస్ట్ చేసిన NIA పోలీసులు
26 మంది మృతిచెందిన పహల్గాం ఉగ్రదాడికి దిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. “పహల్గాంకు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు సాయుధ ఉగ్రవాదుల గుర్తింపులను వెల్లడించారు” అని దర్యాప్తు సంస్థ పేర్కొంది. వారు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో అనుబంధంగా ఉన్న పాకిస్థానీ పౌరులని నిర్ధారించారని చెప్పింది…..
