…భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ నజఫ్గఢ్ ప్రాంతానికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..
ఈ వీడియోలో ఢిల్లీ పోలీస్ సిబ్బంది ఒక చిన్నారిని నీటిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి..
సమాచారం ప్రకారం, ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఆ బాలిక నీటి దగ్గర నిలబడి వీడియో (రీల్) చిత్రీకరిస్తుండగా ఒక్కసారిగా ఆమె కాలు జారి నీటిలో పడిపోయిందని చెబుతున్నారు..
