భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇజ్రాయెల్ ఇక నుంచి ఇరాన్‌పై దాడులు చేయదు: డొనాల్డ్ ట్రంప్
Jun 25, 2025,

ఇజ్రాయెల్ ఇక నుంచి ఇరాన్‌పై దాడులు చేయదు: డొనాల్డ్ ట్రంప్
ఇజ్రాయెల్ ఇక నుంచి ఇరాన్‌పై దాడులు చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. “ఇజ్రాయెల్ పంపిన యుద్ధ విమానాలు వెనక్కి వచ్చేస్తాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వెళ్లినా ఎలాంటి హాని చేయవు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు అలా వెళ్లి.. ఇలా వచ్చేస్తాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉంది. ఇరాన్ తన అణు కేంద్రాలను పునర్నిర్మించదు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండబోదు.” అని ట్రంప్ తెలిపారు.