భారత్ న్యూస్ ఢిల్లీ…..టెక్సాస్ను వీడని వరదలు
టెక్సాస్లో భారీ వరదల కారణంగా మృతుల సంఖ్య 82కి చేరింది. సుమారు 41 మంది గల్లంతయ్యారు. గ్వాడాలుపే నది ఉప్పొంగడంతో జనజీవనం స్తంభించిపోయింది. అధికారులు 850 మందిని కాపాడినట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
