.అర్ధరాత్రి విద్యార్థిని మెడికల్ కాలేజీ నుంచి బయటకు ఎందుకు వచ్చింది

భారత్ న్యూస్ ఢిల్లీ…..అర్ధరాత్రి విద్యార్థిని మెడికల్ కాలేజీ నుంచి బయటకు ఎందుకు వచ్చింది

పశ్చిమబెంగాల్ వైద్యవిద్యార్థిని సామూహిక అత్యాచార ఘటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు

మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించడంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ విఫలమైందని ఆరోపణ

బాధిత విద్యార్థిని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకుంటోంది. ఈ లెక్కన ఆ కాలేజీలోని విద్యార్థినుల భద్రత, రక్షణ బాధ్యత ఆ కాలేజీదే

అర్ధరాత్రి 12.30 గంటలకు ఆ అమ్మాయి కాలేజీ నుంచి ఎందుకు బయటకు వచ్చింది? అమ్మాయి అర్ధరాత్రి బయటకు వస్తుంటే కాలేజీ సెక్యూరిటీ ఏం చేస్తోంది?

జరిగిన ఘటన బాధాకరమే నేను ఒప్పుకుంటా.. కానీ అసలు అమ్మాయి అర్ధరాత్రి బయటకు వెళ్తుంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది?

అటవీ ప్రాంతంలోని ఆ కాలేజీ నుంచి అర్ధరాత్రి ఎవరినీ బయటకు అనుమతించకూడదు. అయినాసరే బయటకొస్తామంటే వాళ్ల రక్షణ బాధ్యత వాళ్లే చూసుకోవాలి

అది పూర్తిగా ఆటవీప్రాంతం. ఈ విషయంలో రాష్ట్ర పోలీసులను తప్పుబట్టడానికి ఏం లేదు

వ్యక్తులు వ్యక్తిగతంగా రాత్రిళ్లు చేసే షికార్లను పోలీసులు ఎలా ముందే పసిగట్టగలరు?

రాత్రి ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తున్నారో పోలీసులకు ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్క ఇంటి ముందు పోలీసులు రక్షణగా నిలబడలేరుకదా? మహిళా విద్యార్థులు తాముండే హాస్టళ్ల నిబంధనలను అతిక్రమించకూడదు. రాత్రివేళ బయటకు వచ్చే సాహసం చేయకండి అని వ్యాఖ్యానించిన పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ